బస్సు ఎక్కే సమయంలో మహిళకు గాయాలు

బస్సు ఎక్కే సమయంలో మహిళకు గాయాలు

ములుగు జిల్లా ఏటూర్‌నాగారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాంనగర్ గ్రామానికి చెందిన మహిళ బస్సు ఎక్కుతుండగా బస్సు టైరు కాలు మీదుగా వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మహిళ కాలు నుజ్జునుజ్జు అయ్యింది. గాయపడిన మహిళను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.