VIDEO: మద్యం మత్తులో RTC డ్రైవర్ పై..యువకులు దాడి
MHBD: మహబూబాబాద్-HYD మార్గంలో మంగళవారం సాయంత్రం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు డ్రైవర్ పై దాడి చేశారు. యువకులు బస్టాండ్‌లో దిగాల్సి ఉండగా నిద్రపోతున్న వారిని డ్రైవర్ లేపడంతో ఆగ్రహించిన యువకులు “మాపై చేయి చేసుకుంటావా?” అంటూ దాడికి దిగారు. వెంటనే డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఇద్దరినీ అప్పగించాడు.