నేడు టీమిండియాకు ప్రధాని మోదీ ఆతిథ్యం
ICC మహిళల ప్రపంచ కప్-2025 విజేతగా నిలిచిన భారత జట్టుకు PM మోదీ ఇవాళ సాయంత్రం తన అధికారిక నివాసంలో ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు అమ్మాయిల జట్టు నిన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకుంది. ఈ ఆతిథ్యం సందర్భంగా హర్మన్ సేనను మోదీ అభినందించనున్నారు. కాగా టీమిండియా WWC ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి కోట్లాది మంది భారతీయుల చీరకాల స్వప్నాన్ని సాకారం చేసింది.