అయ్యప్ప స్వామి కుంభాభిషేకం పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను గురువారం ఆయన నివాసంలో అయ్యప్ప స్వాములు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 27, 28, 29, 30 తేదీలలో గుంతకల్లులోని అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే కుంభాభిషేకం పూజకు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం అయ్యప్ప స్వామివారి ప్రసాదాలను అందజేశారు.