నేడు జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

KMM: నగరంలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నట్లు మంత్రి పీఏ రంజిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సా. 5 గంటలకు ఇల్లందు క్రాస్ రోడ్‌లోని ఐటీ హబ్ వద్ద ఫుట్ పాత్ నిర్మాణానికి శంకుస్థాపన, సర్దార్ పటేల్ స్టేడియంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.