'రైతులు పకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి'
SRCL: రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని వేములవాడ రూరల్ మండలం వ్యవసాయ అధికారిణి వంచ వినీత రెడ్డి సూచించారు. మంగళవారం వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు భూసార పరీక్షల హెల్త్ కార్డు పంపిణీ చేశారు. ఈ మేరకు డ్రోన్ వినియోగంపై అవగాహన కల్పించారు.