పేదలకు అండగా ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే
MBNR: మహబూబ్ నగర్ మండలంలోని అప్పనపల్లి, ఏదిరా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తోందని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమానికే కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.