VIDEO: సూర్యాపేటలో బస్సులు నిలిపివేత

VIDEO: సూర్యాపేటలో బస్సులు నిలిపివేత

SRPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ సూర్యాపేటలో కొనసాగుతోంది. ఉదయం నుంచే బంద్ మొదలైంది. సూర్యాపేటలోని కొత్త, పాత, హైటెక్ బస్టాండ్‌ల వద్ద ఆర్టీసీ బస్సులు ఉదయం 9 గంటల వరకు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.