మోదుగుగుంటలో రైతు అవగాహన సదస్సు
W.G: తాడేపల్లిగూడెం మండలం మోదుగుగుంట గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు అవగాహన సదస్సుకు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో కోతకు సిద్ధమైన వరి పంటను పరిశీలించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతుందని తెలిపారు.