దుర్గాలమ్మ ఆలయంలో 500 మందికి అన్నదానం
VSP: మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం జాతర గట్టు దుర్గాలమ్మ ఆలయంలో శుక్రవారం 500 మంది భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈ అన్నదానాన్ని మధురవాడ కృష్ణానగర్‌కు చెందిన దీవి జగ్గారావు - లక్ష్మి దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అయ్యప్ప, భవానీ, శివ మాల ధారులకు ప్రసాదం అందించారు.