పల్లా శ్రీనివాసరావును కలిసిన టీడీపీ నాయకులు
SKLM: పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు అగతముడి మాధవరావు, అగతముడి అరుణ్ కుమార్, మాతల గాంధీ మంగళవారం విశాఖపట్నం గాజువాక టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి, కొత్తూరు మండలంలోని పలు సమస్యలను వివరించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.