గిల్, సూర్య తిరిగి పుంజుకుంటారు: కోచ్
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, గిల్ పేలవ ప్రదర్శన కొనసాగించారు. గిల్ డకౌట్ కాగా.. సూర్య 5 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే సూర్య, గిల్ ఫామ్‌పై ఆందోళన అవసరం లేదని టీమిండియా సహాయ కోచ్ ర్యాన్‌టెన్ పేర్కొన్నాడు. వారు త్వరలోనే తిరిగి పుంజుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు. నాణ్యమైన ప్లేయర్లు, కెప్టెన్లకు మద్దతు ఇవ్వాలని అన్నాడు.