అవుకులో 16న బండలాగుడు పోటీలు

NDL: అవుకులో వెలసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవస్వామి తిరుకళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఈనెల 16న జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెంకటరమణ నాయక్ తెలిపారు. గెలుపొందిన ఎడ్ల యజమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొదటి బహుమతి రూ.లక్ష, రెండో రూ.80 వేలు, మూడు రూ.60 వేలు అందజేస్తామని తెలిపారు.