సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

ADB: ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామస్తులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. రానున్న రోజుల్లో గ్రామంలో సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.