కరెంట్ తీగలపై చెట్టు కొమ్మలు

కృష్ణా: విజయవాడలోని క్రీస్తురాజపురంలో కరెంట్ వైర్లపై చెట్టు కొమ్మలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు తెలిపారు. గాలి వచ్చినప్పుడు కరెంట్ తీగలపై చెట్టు కొమ్మలు పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి వైర్లపై వేలాడుతున్నా చెట్టు కొమ్మలను తొలగించాలని వారు కోరుతున్నారు.