టికెట్ల ధరలపై పరిమితి ఎత్తివేసిన కేంద్రం

టికెట్ల ధరలపై పరిమితి ఎత్తివేసిన కేంద్రం

దేశీయ విమాన టికెట్ల ధరలపై ఇప్పటివరకు అమలులో ఉన్న తాత్కాలిక పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ కొత్త నిబంధన రేపటి నుంచి అమల్లోకి రానుంది. డిమాండ్‌కు అనుగుణంగా టికెట్ల ధరలను స్వేచ్ఛగా నిర్ణయించుకునే వెసులుబాటు విమానయాన సంస్థలకు కలగనుంది. అయితే, పండగలు, అత్యవసర సమయాల్లో అన్యాయంగా ధరలు పెంచితే తీవ్రంగా పరిగణిస్తామని పౌర విమానయాన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.