మహిళా సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే

మహిళా సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే

MHBD: మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు. కంబాలపల్లి, వేమునూరు ఉత్తర తండాలలో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, మహిళలు ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే అన్నారు.