VIDEO: విఘ్నేశ్వర స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు

కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో మంగళవారం హుండీ ఆదాయం లెక్కింపు ద్వారా రూ. 66,68,257 ఆదాయం వచ్చిందని ఆలయ డిప్యూటీ కమిషనర్ దుర్గ భవాని తెలిపారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది హుండీ ఆదాయాన్ని తెరిచి లెక్కించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలకు రూ.15,16,469 అధికంగా వచ్చినట్లు వెల్లడించారు.