సారవకోటలో సందడిగా కృష్ణాష్టమి వేడుకలు

SKLM: సారవకోట మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సందడిగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులు రాధా, కృష్ణుడు వేషదారణ ధరించి గ్రామాల్లో తిరుగుతూ సందడి చేశారు. పలు చోట్ల ఉట్టి కొట్టే కార్యక్రమం జరిగింది. నిర్వహకులు విజేతలకు బహుమతులు అందజేశారు.