VIDEO: జవాన్ కుటుంబానికి మంత్రి ఆర్థిక సాయం

సత్యసాయి: గోరంట్ల మండలం కల్లి తండా గ్రామానికి చెందిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని మంత్రి సవిత శుక్రవారం పరామర్శించారు. వీర జవాన్ మృతి చాలా బాధాకరమని మంత్రి అన్నారు. జవాన్ చిత్రపటానికి నివాళులర్పించి తన వంతు సాయంగా రూ. 5 లక్షల చెక్కును మంత్రి అందజేశారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు.