‘సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం’
ADB: దేశ అభివృద్ధితో పాటు పట్టణ గ్రామస్థాయిలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమని మాజీ ఎంపీటీసీ గజానంద్ అన్నారు. బజార్హత్నూర్ మండలం భోస్ర గ్రామంలో గురువారం రూ.4 లక్షల NREGS నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక సర్పంచ్ సుభాష్, బీజేపీ మండల అధ్యక్షుడు పోరెడ్డి శ్రీనివాస్‌తో కలిసి పనులను ప్రారంభించారు.