VIDEO: బోల్తా కొట్టిన కారు.. తప్పిన ప్రమాదం
NLR: కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు వెళ్తున్న కారు పంచర్ కావడంతో ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు ఉండగా ఎవరికి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.