అది నా పూర్వజన్మ సుకృతం: సీఎం

అది నా పూర్వజన్మ సుకృతం: సీఎం

TG: కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలపై CM రేవంత్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. 'రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి దక్షిణ త్రివేణీ సంగమమైన కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలను ప్రారంభించడం నా పూర్వజన్మ సుకృతం. ఈ సందర్భంగా పుష్కర ఘాట్​లో పుణ్యస్నానమాచరించి శ్రీ సరస్వతీదేవి ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరించాను' అంటూ పుష్కరాల్లో పాల్గొన్న ఫొటోలను షేర్ చేశారు.