ఉండవెల్లి ఆసుపత్రిలో మొదటి కాన్పు..!
GDWL: ఉండవెల్లి మండలం, అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రిలో మూడు నెలల తర్వాత ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున మొదటి కాన్పు విజయవంతమైంది. మండల కేంద్రానికి చెందిన సంధ్య అనే మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు స్టాఫ్ నర్స్ లత తెలిపారు. ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన డాక్టర్లు, స్టాఫ్ నర్సులు ఉన్నారని, గర్భిణీలు నిశ్చింతగా కాన్పులకు రావచ్చని ఆమె భరోసా ఇచ్చారు