VIDEO: మేడారంలో పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ప్రాంతంలో కొత్తగా నిర్మించిన నార్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ స్టేషన్‌లో సుమారు 30 మంది సిబ్బంది పనిచేస్తారు. మేడారం జాతర సమయంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వేగవంతమైన పోలీస్ సేవలు అందించడంలో ఈ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్ తెలిపారు.