శ్రీరాముడి జీవితం అందరికి ఆదర్శప్రాయం: ఎమ్మెల్యే
MDCL: సికింద్రాబాద్ నియోజకవర్గంలో సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా సీతాఫల్‌మండి, నామాలగుండు తదితర ప్రాంతాలలో సీతారాముల కళ్యాణ వేడుకల్లో ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముడి జీవితం అందరికి ఆదర్శప్రాయమన్నారు. మనుషులు సన్మార్గంలో జీవించాల్సిన తీరుతెన్నులను శ్రీరాముడు చాటి చెప్పారన్నారు.