కొనసాగుతున్న ఇంటర్నెట్ వైర్ల కటింగ్.. WiFi బంద్..!

మేడ్చల్: ఉప్పల్, చిలుకా నగర్, నాచారం, హబ్సిగూడ లాంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ వైర్ల కటింగ్ కొనసాగుతోంది. నిన్నటి నుంచి పరిసర ప్రాంతాల్లో వైఫై బంద్ కావడంతో, వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు, టీవీలకు వైఫై కనెక్ట్ ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లి, వైఫై ఉన్న సోదరులు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.