రేషన్ షాపుల్లో తనిఖీలు PDS బియ్యం సీజ్

PLD: జిల్లా పౌర సరఫరాల అధికారులు, తహసీల్దార్లు, ఆర్ఐలు రేషన్ షాపులు, రైస్ మిల్లులపై దాడులు చేశారు. రొంపిచర్ల, ఈపూరు, బొల్లాపల్లి మండలాల్లోని పలు రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకుల వ్యత్యాసాలను గుర్తించారు. వినుకొండ రైస్ మిల్లులో 45.50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్ చేసి, 6ఏ కేసులు నమోదు చేశారు.