3వ రోజుకు చేరుకున్న శ్రీ పైడమ్మ జాతర మహోత్సవాలు
కృష్ణా: పెడన గ్రామదేవత శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మూడవ రోజు ఘనంగా కొనసాగింది. అమ్మవారు పురవీధుల్లో ఊరేగింపుగా వెలిగి ఆలయానికి చేరుకున్నారు. కాపుల వీధి ఆనవాయితీగా 11 సిడిబండ్లు వేషాధారణలు, కోలాటాలతో ఊరేగి ఆలయానికి చేరాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా చేరుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల సౌకర్యాల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.