CM పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

CM పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

NLR: ఏప్రిల్ 1న వింజమూరులో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల, ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలం, చెరువు సుందరీకరణ పనులు, సభ ప్రాంగణాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.