ఉద్యోగి ఇంట్లో చోరి.. బంగారం, నగదు అపహారణ
మంచిర్యాల జిల్లా గౌతమేశ్వర కాలనీలో రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి నాగన్న ఇంట్లో చోరి జరిగింది. నాగన్న ఊరికి వెళ్లి గురువారం రాత్రి ఇంటికి చేరుకోగా బీరువా తలుపులు పగలగొట్టి కనిపించాయి. బీరువాలో 40 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, 2 కిలోల విలువచేసే వెండి వస్తువులతో పాటు రూ లక్ష 50 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.