సైబర్ నేరాలపై వినూత్న అవగాహన

సైబర్ నేరాలపై వినూత్న అవగాహన

KMM: సైబర్ నేరాలపై టూ టౌన్ PS హెడ్ కానిస్టేబుల్ బోనగిరి నాగేశ్వరరావు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తన కుమార్తె వివాహ శుభలేఖలో ఒక పేజీని 'సైబర్ నేరాలపై అవగాహన మీకు రక్ష' అనే శీర్షికతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. 'చిన్న లింక్ పెద్ద నష్టం, ఉచిత గిఫ్ట్ కోసం ఆశపడొద్దు, ఫోన్ పార్సిల్ కాల్స్‌తో జాగ్రత్త, ఒక్క చిట్కా మీ జీవితాన్నే మార్చేస్తుంది' వంటి ఉప శీర్షికలతో వివరించారు.