ఎస్పీ ఆధ్వర్యంలో 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’
కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధ్యక్షతన సోమవారం 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 106 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ బాధితులతో నేరుగా సంభాషించారు. చట్టపరిధిలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వృద్ధులు,దివ్యాంగుల సౌకర్యార్థం వీల్ చైర్లను ఏర్పాటు చేశారు.