కలెక్టరేట్‌లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి అధికారులు, సిబ్బంది భారత రాజ్యాంగం పీఠికను ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కుల, మత, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరునికి సమన్యాయం అందించడమే రాజ్యాంగం లక్ష్యమన్నారు.