రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు
MDK: పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్ గ్రామ శివారులో ఆటో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. స్థానికులు 108కు సమాచారం అందించి, క్షతగాత్రులను 108సహాయంతో మెరుగైన చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.