27, 28 తేదీల్లో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ: మంత్రి

27, 28 తేదీల్లో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ: మంత్రి

సత్యసాయి: ధర్మవరంలోని పోతుకుంట ఏరియా ఆసుపత్రిలో ఈనెల 27, 28 తేదీల్లో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ శిబిరం నిర్వహించనున్నారు. మంత్రి సత్యకుమార్ ప్రత్యేక చొరవతో సంస్కృతి సేవా సమితి, భగవాన్ మహావీర్ వికలాంగ సహాయత సమితి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయి. అవసరమైన వారు కృత్రిమ కాళ్లు, చేతులు, ఇతర పరికరాల కోసం 7998256789ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.