VIDEO: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

MDK: వెల్దుర్తి మండలం మంగళ్‌పర్తి గ్రామంలో విద్యుదాఘాతం ఏర్పడి ఓ వృద్ధ రైతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వెల్దుర్తి మండలంలో నిన్న రాత్రి వర్షం కురిసింది. రోజు ఉదయంలాగానే పంటలను పరిశీలించేందుకు గద్దె దశరథ(60) పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్తు స్టార్టర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతం ఏర్పడి అక్కడికక్కడే మృతి చెందాడు.