దేవరకొండ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే

NLG: చందంపేట మండలం ముడుదండ్లలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి, ఈదమ్మ తల్లి, ఆంజనేయ స్వామి ధ్వజ స్తంభ, బొడ్రాయి (నాభిశిల) విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.