ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

AKP: కసింకోట మండలం కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందినట్లు సీఐ స్వామి నాయుడు బుధవారం తెలిపారు. ఈనెల 8వ తేదీ రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బయ్యవరం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కె.నారాయణ రావు తీవ్రంగా గాయపడ్డాడు. కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసామన్నారు.