రేషన్ బియ్యం కోసం గంటల తరబడి వెయిటింగ్
KMR: జిల్లా ప్రజలకు ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఏప్రిల్, మే, జూన్ బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. లబ్ధిదారులు స్థానిక చౌక ధరల దుకాణాలలో సన్న బియ్యాన్ని ఒకేసారి పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో ఒక్కొక్కరి వేలి ముద్రలు మూడుసార్లు తీసుకోవాల్సి వస్తుంది.