ఎల్లారెడ్డిపేటలో బైక్ దొంగ అరెస్టు

ఎల్లారెడ్డిపేటలో బైక్ దొంగ అరెస్టు

SRCL: బైక్ దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు. ఈనెల 8న తంగళ్లపల్లి మండలం గడ్డిలచ్చపేటకు చెందిన బోరు మోటార్ మెకానిక్ శ్రీనివాస్, గొల్లపల్లి శివారులోని పంట పొలాల వద్ద తన బైక్‌ను పార్క్ చేసి వెళ్లగా చోరీకి గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి తిరుపతిని అరెస్టు చేశారు.