VIDEO: ఏనుగొండలో మురుగునీటి సమస్య, స్థానికుల ఆందోళన
NBNR: మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని ఏనుగొండ శివారులో భారీగా మురుగునీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పై ప్రాంతాల మురుగు ఇండ్ల మధ్యలోకి వచ్చి చేరిందని కాలనీ వాసులు తెలిపారు. దోమలు, ఈగల వల్ల డెంగీ, మలేరియా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.