ఆర్టీఐ ద్వారా ప్రజలకు సుపరిపాలన: డీఐఈవో

ఆర్టీఐ ద్వారా ప్రజలకు సుపరిపాలన: డీఐఈవో

WGL: ఆర్టీఐ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందుతుందని డీఐఈవో డా.శ్రీధర్ అన్నారు. శుక్రవారం వరంగల్‌లోని ఏవీవీ జూనియర్ కాలేజీలో ఆర్టీఐపై నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలను పరిశీలించారు. సమాచార హక్కు చట్టం-2005 అనేది ప్రజలకు సమాచారాన్ని పొందడంలో వజ్రాయుధంగా ఉపయోగపడుతుందన్నారు. ఈచట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయినందున ప్రభుత్వం పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుందన్నారు.