ఐదుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

ఐదుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

కోనసీమ: ఆలమూరులో ఐదుగురు పేకాట రాయళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సంత మార్కెట్ వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసి ఐదుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 13,310 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆలమూరు ఎస్సై నరేష్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.