రేషన్ డీలర్లకు ఈ-పాస్ మిషన్లు పంపిణీ

BPT: అద్దంకిలోని మండల పరిషత్ కార్యాలయం నందు కొరిశపాడు, మార్టూరు, పంగులూరు మండలాలకు చెందిన రేషన్ డీలర్లకు ఈ-పాస్ మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్‌మెంట్ డిప్యూటీ ఎమ్మార్వో షేక్ గఫూర్ పాల్గొని 120 మంది రేషన్ డీలర్లకు ఈ-పాస్ మిషన్లను అందజేశారు. పాత మిషన్లు పని చేయకపోవడంతో కొత్త మిషన్లు ఇచ్చినట్లు గఫూర్ చెప్పారు.