ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం
VZM: సంతకవిటి క్రీడా ప్రాంగణంలో సీఐ ఉపేందర్ రావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ఆహారం ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మన శరీరం, మనసును ఆధీనంలో ఉంచుకునేందుకు యోగా ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఆరోగ్య కరమైన, ఆనందకరమైన సమాజం కోసం యోగా చేయాలని ట్రైనర్ కొరికాన శ్రీనివాస్ రావు పిలుపిచ్చారు.