జనవరి 3 నుంచి మిడ్ డే మీల్ స్కీమ్‌ ప్రారంభం

జనవరి 3 నుంచి మిడ్ డే మీల్ స్కీమ్‌ ప్రారంభం

ATP: కొత్తచెరువులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జనవరి 3వ తేదీ నుంచి మిడ్ డే మీల్ స్కీమ్ ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపల్ జ్యోతిర్లత గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొంటారన్నారు. ఈ పథకంలో వంట పాత్రల కోసం రూ. 20వేలను వదాన్య సొసైటీ ఫౌండర్ అశోక్ ప్రిన్సిపాల్‌కు అందించారు. కార్యక్రమంలో చంద్రమౌళి, అధ్యాపకులు పాల్గొన్నారు.