'నలుగురిపై కేసు.. రిమాండ్‌కి తరలింపు'
NZB: బోధన్ బాబా గార్డెన్ సమీపంలో ఇసుక టిప్పర్లను అడ్డగించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ నిరాకరించడంతో టిప్పర్ అద్దాలు పగలగొట్టి దాడి చేయడంతో పాటు, వీడియో తీసిన మరో డ్రైవర్‌పై కూడా దాడి చేసి ఫోన్‌ను ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కి తరలించినట్లు సీఐ వెంకట నారాయణ తెలపారు.