నేపాల్‌లో హింస.. హృదయవిదారకం: మోదీ

నేపాల్‌లో హింస.. హృదయవిదారకం: మోదీ

నేపాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు హృదయవిదారకరమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఘటనల్లో అనేక మంది యువత ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేపాల్‌లో స్థిరత్వం, శాంతి భారత్‌కు అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. తక్షణమే యువతియువకులు శాంతికి మద్దతు ఇవ్వాలని కోరారు. నేపాల్ పరిణామాలపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైన సందర్భంగా మోదీ ఈ విధంగా స్పందించారు.