'దీపావళి వేళ నిర్లక్ష్యం వద్దు'

'దీపావళి వేళ నిర్లక్ష్యం వద్దు'

NLG: దీపావళి పండుగను ప్రజలు సురక్షితంగా జరుపుకోవాలని 108 అంబులెన్స్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సలీం ఒక ప్రకటనలో కోరారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ప్రజలందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. పండుగ వేళ చిన్న నిర్లక్ష్యం, అజాగ్రత్త  వహిస్తే ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. 24 గంటలు 108 అందుబాటులో ఉంటుంది అని తెలిపారు.